
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై గురువారం ఉదయం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మంత్రి చెప్పారు.
వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేయబోతున్నామని మంత్రి తెలియజేశారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు దక్షత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలన్నీ త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment