అదృశ్యమైన స్వర్ణ, మంగ్లీ
సాక్షి, పాలకుర్తి టౌన్: తల్లీబిడ్డ అదృశ్యమైన సంఘటన మండలంలోని కొండాపురం పెద్దతండాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... మునవత్ స్వర్ణ(20), తన బిడ్డ మంగ్లీ (9నెలలు) ఈ నెల 23న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారి ఆచూకీ లభించకపోవడంతో స్వర్ణ తండ్రి అంగోత్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వర్ణ, మంగ్లీ ఆచూకీ తెలిసిన వారు 9440700549, 9440904658 నెంబర్‌లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై సతీష్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment