చంద్రబాబుకు కవిత సవాల్.. | MP kavitha Open Challenge to chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కవిత సవాల్..

Published Thu, May 28 2015 11:20 AM | Last Updated on Fri, Sep 7 2018 2:12 PM

చంద్రబాబుకు కవిత సవాల్.. - Sakshi

చంద్రబాబుకు కవిత సవాల్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆమె గురువారమిక్కడ స్పష్టం చేశారు. హైదరాబాద్లో భూములు అమ్మింది ఎవరో, అభివృద్ధి చేసింది ఎవరో తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే తమ సవాల్ను స్వీకరించాలని ఆమె అన్నారు.

మనుషులను చంపటం...ఆ తర్వాత మాలలు వేయటం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, అలాగే అమరవీరుల చావుకు కారణమైన ఆ పార్టీ ... ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ మహానాడు రికార్డింగ్ డ్యాన్స్ను తలపిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. తెలుగు యూనివర్శిటీ రెండుగా విడిపోతే సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెడతామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement