సందడే..సందడి! | Noise your time ..! | Sakshi
Sakshi News home page

సందడే..సందడి!

Published Wed, Jun 11 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

Noise your time ..!

కడ్తాల: ఆమనగల్లు మండలం మైసిగండి  మైసమ్మ అమ్మవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం వర కు అక్కడే కాలక్షేపం చేసి..ఆనందోత్సహాలతో గడిపారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, చందంపేట జెడ్పీటీసీ సభ్యుడు బాలునాయక్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు.

మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడే ఏర్పాటుచేసిన విందులో టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. వారికి ఆలయ ఈఓ రంగారెడ్డి, ఫౌండర్‌ట్రస్టీ శిరోలీ, గ్రామ సర్పంచ్ శేఖర్‌గౌడ్, యాదగిరిగౌడ్ స్వాగతం పలికారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement