ఎడపల్లి(నిజామాబాద్ జిల్లా): ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తల భాగం నుజ్జునుజ్జు కావటంతో మృతుడు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టంగా మారింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.