⇒సంస్థాగత నిర్మాణంపై ఇక టీఆర్‌ఎస్ దృష్టి
⇒నేటి నుంచి సభ్యత్వ సేకరణ
⇒చురుకుగా పాల్గొన్నవారికే నామినేటెడ్ పదవులు!
⇒కనీసం 2.70 లక్షల సభ్యత్వాలు లక్ష్యం
⇒పరుగులు పెడుతున్న నేతలు
⇒మార్చిలో కొత్త కమిటీలు
⇒తాత్కాలిక కమిటీలో జిల్లాకు దక్కని చోటు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొత్త రాష్ర్టంలో తొలిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ర్ట సమితి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిం చింది. గ్రామస్థాయి నుంచి ఇప్పుడున్న అన్ని కమిటీలను రద్దు చేసిన ఆ పార్టీ నాయకత్వం సభ్యత్వ సేకరణ సందర్భంగా బలాన్ని నిరూపించుకునేందుకు సన్నద్ధమైంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ సేకరణ చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 5 వేల క్రియాశీల, 25 వేల సాధారణ సభ్యత్వాలను సేకరించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు మంగళవారం జరిగిన సమావేశంలో దిశానిర్ధేశనం చేశారు.
ఈ లెక్కన జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 2.70 లక్షలకు తగ్గకుండా సభ్యులను పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనుండగా, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు సభ్యత్వ సేకరణకు పోటీపడే అవకాశం ఉంది. కాగా, 12 మందితో రాష్ట్రస్థాయిలో వేసిన పార్టీ అడ్‌హక్ కమిటీలో జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు.
మార్చి 1 నుంచి కొత్త కమిటీల ప్రక్రియ
టీఆర్‌ఎస్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో నిర్వహించిన సమావేశం తర్వాత అన్ని కమిటీలు రద్దయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీలోగా అన్ని స్థాయిలలో కొత్త కమిటీలను ఎ న్నుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత కమిటీలను మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే జిల్లాలో కొత్తగా సభ్యత్వ సేకరణ నమోదు చేయాల్సి ఉంది. అయితే, గురువారం నుంచి నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బాన్సువాడ తదితర నియోజకవర్గాల నుంచి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నిర్ణయించారు.
ఎట్టి పరిస్థితులలోనూ సభ్యత్వ నమోదును ఈనెల 24 వరకు ముగించాల్సి వుంది. నాలుగైదు రో జులు అటుఇటైనా మార్చి ఒకటి నుంచి కొత్త కమిటీల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన నాయకులను సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా నియమించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి పది వరకు గ్రామ కమిటీల ఎన్నికలు, 11 నుంచి 20 వరకు మండల, పురపాలిక కమిటీల ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో జిల్లా కమిటీతోపాటు, అనుబంధ కమిటీల ప్రక్రియ పూర్తి కానుంది. ఏప్రిల్ 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఆవిర్భావసభ కంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
సభ్యత్వ నమోదు ఆధారంగానే నామినేటెడ్ పదవులు
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్ నామినేటెడ్ పదవులను కట్టబెట్టేందుకు గ్రేడింగ్‌ను నిర్ణయించనుంది. నామినేటెడ్ పదవులను ఆశించే నాయకులు సభ్యత్వ సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఏ మేరకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారన్న విషయాలను పరిశీలించనుంది. ఇందుకోసం జిల్లా మంత్రులతోపాటు సంస్థాగత ఎన్నికల పరిశీలకుల నివేదికలనే ప్రామాణికంగా తీసుకోనున్నారని తెలిసింది.
సంస్థాగత పదవులను రద్దు చేసిన కేసీఆర్, సభ్య త్వ సేకరణ, కొత్త కమిటీలతోపాటు నామినేటెడ్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్లు ప్రకటించా రు. ఈ నేపథ్యంలో జిల్లా, రాష్ర్టస్థాయిలలో పదవులు ఆశిస్తున్న ఎమ్మె ల్యేలు, ద్వితీయశ్రేణి నేతలకు సభ్యత్వ సేకరణ సవాల్‌గా మారనుంది. పార్టీ ఇచ్చిన టార్గెట్లను మించి సభ్యత్వ సేకరణ చేసేందుకు నేతలు కార్యాచరణ రూ పొందించుకుంటున్నారు. వాటర్ గ్రిడ్, టీఎస్‌ఎండీసీ పోస్టుల కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు పోటీ పడుతుండగా, వ్యవసాయ మార్కెట్, దేవాలయ, గ్రంథాలయ కమిటీలతోపాటు పలు నామినేటెడ్ పదవులపై నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే కలలు కంటున్నారు.
దీంతో వారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురు గ్గా పాల్గొనే అవకాశం ఉంది. పార్టీలో సభ్యులుగా చేరేవారికి రూ. రెండు లక్షల బీమా సౌకర్యం కూడ కల్పించనున్నట్లు కేసీఆర్ ప్రకటిం చడం కూడ కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఏదేమైనా ప్రజాకర్షక పథకాలతో ఎనిమిది నెల లుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ నేతలందరూ లక్ష్యసాధన దిశగా కదులుతున్నారు.
నేటి నుంచే సభ్యత్వ నమోదు
నిజామాబాద్ అర్బన్ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో బుధవారం జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని భారతీ గార్డెన్‌లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నా రు.
పార్టీ శ్రేణులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆ యా నియోజకవర్గాలలో సంబంధిత ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా నమోదు చేయాలన్నారు. ఇందుకు త గిన కార్యాచరణను రూపొందించారు. ఈ స మావేశంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గులాబీ రేస్
Published Thu, Feb 5 2015 4:42 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement
Advertisement