
మన బిడ్డ ఐఏఎస్
పాలమూరు ప్రభ ప్రతిష్టాకర ‘సివిల్స్’ పరీక్షల్లోనూ మెరిసింది. జిల్లాకు చెందిన ముషారఫ్ అలీ ఫరూకీ అనే యువకుడు గురువారం వెలువడిన ఫలితాల్లో ఫరూకీ 80వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. రాజధాని నగరంలోని బషీర్‌బాగ్‌లో ఆయన కుటుంబం ఉంటోంది. ఫరూకీ తండ్రి ఎన్.ఎం. ఫరూక్ హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది.
ఫరూకీ మేనమామ అంజాద్ ఖాన్ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన కడప జిల్లాలో ఎమ్మెల్యే కాగా, తాత నబీసా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారు. ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఫరూకీ ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో కుటుంబీకులు మిఠాయిలు పంచుకొని సంబరం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి జిల్లావాసులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రాష్ట్రం ఆవిర్భావ వేళ జిల్లాకు దక్కిన చక్కని ఫలితంగా పలువురు అభినందించారు.
-సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్