మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : పాలమూరు యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలల్లో చదువుతున్న డిగ్రీ సప్లి్లమెంటరీ ఫలితాలలను వీసీ రాజరత్నం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మొదటి సంవత్సరంలో 6,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,446 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 1,929 మంది ఫెయిల్ కాగా, 2,608 మంది విద్యార్థులు పైతరగతులకు ప్రమోట్ అయ్యారని, కొందరు మాల్ ప్రాక్టీస్, డీటెయిన్డ్ కింద ఉన్నారని పేర్కొన్నారు. రెండో సంవత్సరంలో 11,515 మందికి 3,255 మంది ఉత్తీర్ణత సాధించగా, 2,926 మంది ఫెయిల్ అయ్యారని, 4,688 మంది ప్రమోట్ అయ్యారని తెలిపారు. మూడో సంవత్సరంలో 7,898 మందికి 2,362 మంది ఉత్తీర్ణత సా«ధించగా, 5,482 ఫెయిల్ అయ్యారు. 51 మంది మాల్‌ప్రాక్టీస్‌లో బుక్ అయ్యారని వీసీ పేర్కొన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గిరిజ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 106 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్ కింద్ బుక్ అయ్యారని, వారు ఈనెల 14న కమిటీ ముందు హాజరుకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులు పరీక్ష పత్రాల రీ వాల్యుయేషన్ కోసం 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు నాగభూషణం, అధ్యాపకులు మనోజ, పవన్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, కిశోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment