జిల్లాకు చెందిన ఓ యువకుడు అంతరాత్జీయ సదస్సులో ప్రతిభ చాటాడు. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఇటీవల జరిగిన గణిత సదస్సుకు మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన లొంక సంపత్ హాజరయ్యా రు.
- గణిత సదస్సుకు హాజరైన సంపత్
- తెలంగాణ నుంచి ఒక్కడికే అవకాశం
- ఐఐటీ రామయ్య ఊరి నుంచి మరో గణితవేత్త
పాలకుర్తి టౌన్ : జిల్లాకు చెందిన ఓ యువకుడు అంతరాత్జీయ సదస్సులో ప్రతిభ చాటాడు. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఇటీవల జరిగిన గణిత సదస్సుకు మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన లొంక సంపత్ హాజరయ్యా రు. దేశం నుంచి ముగ్గురు సభ్యులు ఎంపికకాగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి సంపత్ ఒక్కరే ప్రాతినిథ్యం వహించారు.
గణితానికి పెద్దన్నగా చెప్పుకునే ఐఐటీ చుక్కా రామయ్య స్వగ్రామమైన గూడూరు నుంచి మరో యువ గణిత శాస్త్రవేత్త ప్రపంచస్థాయి సదస్సులో పా లకుర్తి ప్రతిష్టను నిలిపాడు. ప్యారిస్‌లోని ప్రె యిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ లో జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన అంతర్జాతీయ గణిత సదస్సులో సంపత్ పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. దేశం నుంచి టీఐఎఫ్‌ఆర్ ముంబై నుంచి ఒకరు, ఐఐటీ ముంబై నుంచి మరొకరు ఎంపికకాగా.. తెలంగాణ నుంచి సంపత్ ఒక్కరే పాల్గొన్నారు.
చిన్నతనం నుంచే గణితంపై ఆసక్తి
గూడూరు గ్రామానికి చెందిన కొమురయ్య, ఎల్లమ్మ దంపతుల ఎనిమిదవ సంతానం సంపత్. పెద్ద కుటుంబం కావడంతో తరచూ ఆర్థిక సమస్యలు తలెత్తేవి. దీంతో జీవితంలో ఎలాగైన మంచి స్థానంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సంపత్ ఉన్నత విద్య కోసం బాగా శ్రమించాడు. చిన్నప్పటి నుంచే గణితంపై ఆసక్తి పెంచుకొని దానిపై పట్టు సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి.. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2007లో ఎమ్మెస్సీలో సీటు సాధించాడు. ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో గణితంలో పీహెచ్‌డీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
శాస్త్రవేత్త కావడమే లక్ష్యం
ప్రపంచ స్థాయి గణిత శాస్త్రవేతల నుంచి నేను స్ఫూర్తి పొందాను. నా స్వస్థలానికి చెందిన గణిత మేధావి, ఐఐటీ రామయ్య గణితంలో అద్భుతాలు సృష్టించారు. ఆయన మాదిరిగానే తాను గణితంలో నిష్ణాతుడిని కావడమే లక్ష్యం. చిన్నతనం నుంచే పిల్లల్లో గణితంపై ఆసక్తి పెంపొందించేందుకు కృషి చేస్తా. పిల్లల్లో గణితం పట్ల భయం ఎక్కువైందని, అన్ని అంశాలకంటే గణితం అతి సులువైనది. దీనిపై త్వరలో పాలకుర్తిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి.. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు కృషి చేస్తా.