బోరుబావిని పరిశీలిస్తున్న నాయకులు
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: యురేనియంపై ప్రజలు మరోసారి అనుమానపడేలా హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఈనెల 22న ఓసారి హెలి కాప్టర్ చక్కర్లు కొట్టగా తాజాగా మండలంలోని పెద్దగట్టు, నంబాపురం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం సుమారు 3 గం టల ప్రాంతంలో సమయంలో కనిపించిం ది. దీంతో యురేనియం అన్వేషణలో భాగంగానే హెలికాప్టర్ చక్కర్లు కొట్టిందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం అన్వేషణ, వెలికితీసే చర్యలను మానుకోవా లంటూ ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు తమ నిరసన తెలుపుతుండగా వారికి ప్రజా సంఘాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ ఎందుకోసం వచ్చిందో తెలపాలని అధికారులను కోరుతున్నారు.
‘యురేనియం వెలికితీస్తే వినాశనమే’
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ): యురేనియం వెలికితీయడం వల్ల ప్రజలు, జీవరాశులకు వినాశక పరిణామాలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని పెద్దగట్టును ఆయన పరిశీలించి.. యురేనియం వెలికితీయడం వల్ల కలిగే నష్టాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గతంలో యురేనియం కోసం వేసిన బోరు బావులను ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యురేనియం వెలికి తీస్తే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుకుని తీరుతామని చెప్పారు. యురేనియం తవ్వకాలపై కేంద్ర, రాష్ట్రాలు పునరాలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు రానున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట త్రిపురారం జెడ్పీటీసీ భారతిభాస్కర్, ఎంపీపీ పాండరమ్మశ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు నారాయణ, సైదులు, మాధవరెడ్డి, నాయకులు బోడ్యానాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment