* జాగ్రత్త పడిన నిందితులు
* ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ
* ముంబయిలోని ల్యాబ్‌కు అవయవాలు
నిజామాబాద్ క్రైం : గతనెల 28న జిల్లాకేంద్రంలోని శ్రీనగర్‌కాలనీ (వినాయక్‌నగర్)లో తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందిన రాస రాణి(35) హత్యకేసు చిక్కుముడి వీడటం లేదు. హత్య జరిగి దాదాపు 20 రోజులు కావస్తోంది. అయినా నేటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిని బట్టి హంతకులు రాణిని హత్య చేసేముందు ఎతంటి జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతుంది. రాణి హత్యకు గురైన రోజు నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం బృందాన్ని రప్పించారు. కాని ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. క్లూస్‌టీం బృందం వేలిముద్రలు సేకరించారు.
ఈ వేలిముద్రలు గతంలో హంతకుల వేలిముద్రలతో పోల్చి చూశారు. కాని ఫలితం లేకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తులు రాస రాణిని పట్టపగలే తన ఇంట్లోనే హత్య చేసి వెళ ్లటం అప్పట్లో స్థానికంగా సంచలనం సృష్టించింది. రాణి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవటంతో ఆమెను ఎలా చంపారో ప్రశ్నార్థకంగా మారింది. రాణి ఎలా చనిపోయిందో పోస్టుమార్టం నివేదికలు వచ్చాక తెలుస్తాయని అంతా భావించారు. కాని పోస్టుమార్టం నివేదికలో సైతం ఆమె ఎలా చనిపోయిందో వివరాలు తెలియరాలేదు.దీంతో పోలీసులకు హత్య కేసు సవాలుగా మారింది.
రాణి వినియోగించే సెల్‌ఫోన్‌లో కాల్ డాటాతో అయినా కేసును ఛేదించే దిశగా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాల్ డాటాలో కూడా ఎలాంటి ఆధారాలు లభించక పోవటం గమనార్హం. రాణి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవటం, ఆమె శరీరం లోనుంచి చుక్క రక్తపు బొట్టు బయటకు రాకపోవటంతో ఊపిరి ఆడకుండా చేసి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఈ దిశగా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు.రాణిని ఊపిరీ ఆడకుండా చేయాలంటే అది ఒక్కరితో అయ్యే పనికాదు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఈ కేసులో ప్రమేయం ఉండచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం హంతకులు ఆమెను హత్య చేస్తుంటే ఎలాంటి కేకలు వినిపించక పోవటంతో కిందనున్న వారికి అనుమానం రాలేదు. అసలు రాణి ఇంటికి ఆ రోజు ఎవరు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది.
నివేదికలకు మూడు నెలలు ...
రాణిని హంతకులు ఏ విధంగా హతమార్చారో తెలుసుకునేందుకు పోలీసులు అన్నికోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఆమె మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు రాణి హత్యకేసును ఛేదించేందుకు ఆమె శరీర భాగాలలో కొన్నింటిని పరీక్షల నిమిత్తం ముంబ యిలోని ల్యాబ్‌కు పంపారు.
అక్కడి నుంచి నివేదికలు రావాలంటే మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ముంబ యి ల్యాబ్ నుంచి నివేదికలు వస్తేగాని హత్య ఎలా జరిగిందో బయటపడే అవకాశంలేదు. ఆ నివేదికల ప్రకారం కేసు చేధించే అవకాశం ఉంటుందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
చిక్కుముడి వీడని రాణి హత్యకేసు
Published Thu, Oct 16 2014 3:28 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement