
'నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నా'
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పార్టీ తరపున ఆర్థికంగా ఆదుకోవాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. తన వంతు సాయంగా లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నట్టు సుధాకర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల నుంచి విరాళాలు సేకరించి రైతులను ఆదుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతు కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.