జనగామలో 144 సెక్షన్ ఎత్తేయండి: పొన్నాల లక్ష్మయ్య
- డీజీపీకి పొన్నాల వినతి
సాక్షి, హైదరాబాద్: జనగామలో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామకు చెందిన నేతలు, ప్రతినిధులతో కలసి రాష్ట్ర డీజీపీకి హైదరాబాద్‌లో గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనగామను జిల్లా కేంద్రంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
సీఎం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, జనగామను జిల్లా చేయాలని ప్రజలు శాంతియుతంగా, రాజ్యాం గబద్ధంగా పోరాడుతున్నారని పొన్నాల చెప్పా రు. శాంతిభద్రతల సమస్య పేరుతో జనగామ లో 2 నెలలుగా 144 సెక్షన్ విధించడంతో ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పా రు. ప్రజల ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. కనీసం అధికారులైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాలని కోరారు.