భిక్షాటన చేయిస్తున్న దంపతులు
‘చైల్డ్‌లైన్’ చొరవతో వెలుగులోకి..
బషీరాబాద్: ముంబైలో ఓ చిన్నారిని రూ.250లకు కొనుగోలు చేసి ఆమెతో రంగారెడ్డి జిల్లా తాండూరులో భిక్షాటన చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బషీరాబాద్ ఎస్‌ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. బషీరాబాద్ మండలం మంతట్టికి చెందిన విభూతి రాములు, బసమ్మ దంపతులు 8 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. కొన్నాళ్లపాటు అక్కడే పనిచేసిన వారు.. ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఏడేళ్ల క్రితం రెండేళ్ల బాలికను రూ.250లకు కొనుగోలు చేశారు. అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చి, ఆ బాలికతో భిక్షాటన చేయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం రాములు దంపతులు హైదరాబాద్‌కు వెళ్లారు.
రాములు తండ్రి పెంటప్ప దగ్గర ఉంటున్న బాలిక నిత్యం గ్రామంలో భిక్షాటన చేసేది. పెంటప్ప చెప్పడంతో నిత్యం బాలిక తాండూరుకు వెళ్లి రద్దీ కూడళ్లలో డబ్బులు అడుక్కోసాగింది. ఈ విషయమై చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందడంతో ఈనెల 7న చైల్డ్‌లైన్ ప్రతినిధులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాములుతోపాటు అతడి భార్యను, తండ్రిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఆ బాలికను చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు.
ఏడేళ్ల క్రితం రూ. 250కి చిన్నారి కొనుగోలు!
Published Sun, Jan 10 2016 2:40 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement