
ఈటెల రాజేందర్
రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును పెంచే ప్రసక్తే లేదని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును పెంచే ప్రసక్తే లేదని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఖాళీ పోస్టులన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు.