'మందులో సోడా పోసినోళ్లకే పదవులు' | Revanthreddy criticises cm KCR on pension issue | Sakshi
Sakshi News home page

'మందులో సోడా పోసినోళ్లకే పదవులు'

Published Mon, Apr 20 2015 12:49 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

'మందులో సోడా పోసినోళ్లకే పదవులు' - Sakshi

'మందులో సోడా పోసినోళ్లకే పదవులు'

మహబూబ్‌నగర్(వనపర్తి): మందులో సోడా వేసినోళ్లకే పదవులు ఇచ్చారని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రోళ్ల కమీషన్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దాసోహమయ్యారని వ్యాఖ్యానించారు. ఓడిపోయినా.. టీడీపీలో మొనగాళ్లు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 950 మంది రైతులు చనిపోతే సీఎంకు కనీసం పరామర్శించేందుకు వీలుకాలేదా? అని ప్రశ్నించారు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంటే కేవలం 480 మందినే గుర్తించడమేమిటని అడిగారు.

పేదలకు ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇవ్వలేవా? అని నిలదీశారు. సమగ్రకుటుంబ సర్వేలో పశువులు, పందులు, కోళ్ల వివరాలు అడిగిన సీఎం.. పేదలకు ఏం చేశారని ప్రశ్నించారు. మహిళలకు ఒక్కరి కూడా మంత్రి పదవిని ఇవ్వలేకపోయారని, బతుకమ్మ పండగకు మహిళలు తప్పకుండా నిలదీస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement