రూ.30 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి | Rs 30 crore for the development of public hospitals | Sakshi
Sakshi News home page

రూ.30 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి

Published Tue, Dec 16 2014 2:42 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM

రూ.30 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి - Sakshi

రూ.30 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి

‘ఆరోగ్యశ్రీ’ సేవలను 60 శాతం వరకు పెంచుతాం
డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య

 
 ఎంజీఎం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రులకు రూ.30 కోట్లు వెచ్చించి రూపురేఖలు మారుస్తానని, కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో మెరుగైన వైద్య సేవలందిస్తామని  ఉప ముఖ్య మంత్రి రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని టీబీ హాస్పిటల్, జీఎంహెచ్, ఎంజీఎం, కేఎంసీ, సీకేఎం, ఉర్సు, ఆయుష్, ఈఎస్‌ఐ, రీజనల్ ఐ ఆస్పత్రులను ఆదివారం ఆయన సందర్శించిన విషయం తోలిసిందే. రాత్రి ఎంజీఎంలో బస చేసిన ఆనంతరం సోమవారం తెల్లవారు జామున మెడికల్, సర్జికల్ వార్డులను పరిశీలించారు. ఆనంతరం ఆస్పత్రిలోని రోగులకు అందిస్తున్న డైట్ విభాగాన్ని పరిశీలించారు. డైట్‌లో అల్పాహారంగా అందిస్తున్న చపాతీలను రాజయ్య తయారుచేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మనోహర్ ఫైర్ వుడ్ స్ట్రీమ్‌ను గ్యాస్‌కు మార్చనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ పెట్టుబడితో ఫైర్‌వుడ్‌ను గ్యాస్‌కు కన్వర్షన్ చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఎంజీఎంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేసేందుకు  బడ్జెట్ రూపొందించామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని 60 శాతం పెంచడంతో వైద్యులు ఇన్‌సెంటీవ్స్ పొందే ఆవకాశం ఉంటుందన్నారు.ఆస్పత్రులను క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రణాళికలు తయారుచేశామని, వాటిన్నింటికీ నెలరోజుల్లోనే టెండర్లు పిలుస్తామన్నారు. సీమాంధ్ర నాయకుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రులు నరకకూపంగా మారాయన్నారు. డాక్టర్లు మానవతా ధృ క్పథంలో వైద్యసేవలందించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలపై ఆరు నెలల కార్యాచరణ ఉంటుందన్నారు. పక్కా ప్రణాళికతో సమసల్యను పరిష్కరిస్తామన్నారు. టీబీ ఆస్పత్రిలో స్థానిక ప్రజల కోరిక మేరకు 10 ఫీట్ల ఎత్తుతో రాతి గోడను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

రూ.10 కోట్లతో ఎంజీఎం ఆస్పత్రి ఆధునికీకరణ

ఎంజీఎం ఆస్పత్రిలో రాత్రి 12 గంటల నుంచి రాత్రి 3 గంటల  వరకు డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు  తీసుకోవాల్సిన చర్యలను ఆయా డిపార్లమెంట్ల హెచ్‌ఓడీలు పవర్ పారుుంట్ ప్రజెంటేషన్ ద్వారా రాజయ్యకు వివరించారు. ఈ మేరకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.10 కోట్లు అవసరమని అంచనా వేశారు. రూ.4 కోట్లను నెలరోజుల్లో మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రిలో రూ. 46 లక్షలతో విద్యుత్ సమస్య తీరుస్తామన్నారు.  హన్మకొండలోని జీఎంహెచ్ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించి, 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ కడియం శ్రీహరి తన నిధుల నుంచి వారం రోజుల్లో అంబులెన్స్, ఆర్‌ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 66 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అరుున సీకేఎం ఆస్పత్రిలో 200 మంది ఇన్‌పేషంట్ల సంఖ్య ఉంటోందని, ఇందుకనుగుణంగా రూ. 10 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీకేఎం ఆస్పత్రికి ఎంపీ సీతారాంనాయక్ తన నిధుల నుంచి వారం రోజుల్లో అంబులెన్స్‌తోపాటు ఆర్‌ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు, రీజినల్ ఐ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్సలు చేసుకున్న రోగులకు కంటి అద్దాలు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని సరోజన ఆస్పత్రితో పాటు వరంగల్ రీజినల్ కంటి ఆస్పత్రిలో రోగులకు కంటి అద్దాలు అందించేందుకు సంవత్సరానికి రూ.2 కోట్ల మేరకు ఖర్చు కానున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సీకేఎంకు అనుబంధంగా ఉన్న  ఉర్సు ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. రూ. 2 లక్షలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లోగా మెప్మా, అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల సహాయంతో ఆస్పత్రిలో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్కతామన్నారు. విలేకరుల సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట మనోహర్, ఆర్‌ఎంఓలు, వైద్యులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement