మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ వైఖరీని నిరసిస్తూ శనివారం ఆర్టీసీ డిపో గేటు ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ యూ నియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీజేఎంయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా చైర్మన్ ఎండి జాబీర్, డిపో కార్యదర్శి కేవీ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నూతన జీతభత్యాలను అందించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని కేసీఆర్ అనడం దురదృష్టకరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మరిచిపోయారని అన్నారు. సకల జనుల సమ్మెలో 27 రోజుల జీతాలను నేటికి ఇవ్వలేదన్నారు. కార్మికుల శ్రమకు తగ్గ వేతనాలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అరుణ్, వెంకటయ్య, నాగార్జున, బొట్టు శ్రీను తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment