వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికుల ఆందోళన
హైదరాబాద్: పీఆర్సీ అమలు కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేతన సవరణ ప్రధాన డిమాండ్‌గా ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు గురువారం బస్‌భవన్‌ను ముట్టడికి సిద్ధమయ్యాయి. ఎంప్లాయిస్-టీఎంయూ నేతలు పిలుపుతో హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు.
ఉదయం 11 గంటలకు సుందరయ్య పార్క్ నుంచి బస్ భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.