
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుతో పాటు భూమి పాస్‌బుక్ జిరాక్స్ లేక ఎమ్మార్వోచే డిజిటల్ సంతకం చేసిన పేపర్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ (సేవింగ్స్ ఖాతా) తీసుకొని రావాలని సూచించింది. రైతు మాత్రమే వచ్చి దరఖాస్తు ఇవ్వాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment