
నేడు ఇంటర్ ద్వితీయ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను విద్యార్థులు www.sakshieducation.com, http://examresults.tc.nic.in, http://re sults.cgg.gov.in తదితర వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు. కళాశాలల ప్రధానోపాధ్యాయులు తమ కళాశాల ఫలితాలను - http://bie.telangana.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
దీనికి సంబంధిత కళాశాలలకు బోర్డు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వినియోగించాలి. మార్చి 9 నుంచి 27 వరకు జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు 5,06,789 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.77 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,78,972 మంది ఉండగా 93,567 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ఒకేషనల్ విభాగంలో మరో 34 వేల మంది పరీక్షలు రాశారు.
ఇలా కూడా తెలుసుకోవచ్చు
ఈ-సేవ ఆధ్వర్యంలోని పరిష్కారం కాల్‌సెంటర్ నెంబర్‌కు కాల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి 1100, ఇతర ల్యాండ్‌లైన్లు/ మొబైల్ ఫోన్ల నుంచి 18004251110 నెంబర్‌కు కాల్ చేస్తే ఫలితాలు చెబుతారు. ఈ-సేవ, మీ-సేవ, రాజీవ్ సిటిజన్ సెంటర్స్, ఏపీఆన్‌లైన్ సెంటర్ల నుంచి సైతం ఫలితాలను పొందవచ్చు.
ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పా న్స్ సిస్టమ్) ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులు 5207051, వొడాఫోన్ వినియోగదారులు 58888511, అన్నిఫోన్ల వినియోగదారులు 58888కు కాల్ చేసి ఫలితాలు పొందవచ్చు.