నమ్మకముంటే ఎన్నికలకు పో
హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే, సర్వేపై నమ్మకమే ఉంటే రేపే ఎన్నికలకు వెళ్లాలని శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..గత సర్వేలో కేటీఆర్‌కు 46 శాతం వస్తే ఇప్పుడు 91 శాతం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? ఏం చేశారని 91 శాతం వచ్చిందన్నారు. కేసీఆర్ సర్వే ఒక బోగస్ సర్వే అని తేల్చిపారేశారు. 24 గంటలలో ఎన్నికలకు రండి..లేదా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రండని సవాల్ విసిరారు.
సర్వే పై అంత నమ్మకం ఉంటే, కేటీఆర్ పాలన బాగుంటే సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎలక్షన్‌కు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని, సర్వే పై నమ్మకం ఉంటే కేసీఆర్ సవాల్ స్వీకరించాలన్నారు. నియోజకవర్గాల సీట్ల పెంపు ఉంటుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. బీజేపీ ఇది సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.