సాక్షి, హైదరాబాద్: ‘గతంలో ఇంటి నుంచి అరగంటలో అసెంబ్లీకి వచ్చే వాళ్లం. ఇప్పుడు గం టకుపైగా పడుతోంది. హైదరాబాద్‌లో రోడ్లు అంతగా దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికోసం కాకున్నా, త్వరలో నగరానికి రానున్న ట్రంప్ కూతురు, ప్రధాని మోదీ కోసమన్నా బాగుచేయించండి’అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సోమ వారం మండలిలో వ్యంగాస్త్రాలు సంధించారు.
రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ తీరును ఆయన దుయ్యబట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, 50 ఏళ్ల పాలనలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా సరిగా నిర్వహించలేని కాంగ్రె స్ నేతలు చెబితే నేర్చుకునే పరిస్థితిలో తాము లేమన్నారు. ‘‘నగరంలో రోడ్లను భారీ వ్యయం తో బాగు చేస్తున్నాం. మూసీ, రోడ్ల అభివృద్ధికి రూ.వేయి కోట్లకుపైగా కేటాయించాం.
స్ట్రాటజి క్ రోడ్ డెవలప్‌మెంట్ కింద ఇప్పటికే రూ. 1894 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మ రో రూ.975 కోట్ల పనులు చేపట్టనున్నాం’’అని వివరించారు. తాను బదులిస్తుండగా కాంగ్రెస్ నేతలు ఏదో అనడంతో, ‘రన్నింగ్ కామెంటరీకి ఇదేమన్నా క్రికెట్ మ్యాచా?’అంటూ కేటీఆర్ అసహనం వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment