హైదరాబాద్: ఓయూ క్యాంపస్ పరీక్షల నియంత్రణ విభాగం జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలు కొన్ని కాలిపోగా.. మరికొన్ని ఫైరింజన్ నీటికి తడిసిపోయాయి. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తలెత్తగా.. సెక్యూరిటీ గార్డు అధికారులకు సమాచారం అందించాడు.
అప్రమత్తమైన అధికారులు ఫైరింజన్‌ను పిలిపించి ఘోర ప్రమాదాన్ని నివారించగలిగారు. అగ్ని ప్రమాదాన్ని అరికట్టకలిగారు కాని ఫైరింజన్ నీటికి వేలాది జవాబు పత్రా లు తడిసి ముదై్ద, మూల్యాంకనానికి పనికి రాకుండా పోయాయి. కంట్రోలర్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు వీసీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.
చిన్న ప్రమాదమే: కంట్రోలర్
జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో స్పందించి అరికట్టామని కంట్రోలర్ ప్రొ.కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన గదిలో గత నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగిన బీఎస్సీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలున్నాయ న్నారు.
వాటిలో 5 శాతం మాత్రమే కాలిపోయాయన్నారు. అనుకోకుండా జరిగిన ఘట న కాబట్టి తమ తప్పిదం ఏమీ లేదన్నారు. కాగా, అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు క్యాంపస్‌లోని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శివరాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు వీసీ రామచంద్రం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment