నల్లగొండ : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూ చించారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లుగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న అధికారులు, గోదాం ఇన్‌చార్జిలతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ వారికి పౌరసరఫరాల పటిష్టతకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. ఎంఎల్‌ఎస్ పా యింట్ ఇన్‌చార్జీలు, డీటీలు,ఆర్‌ఐలుఅం దరూ ముఖ్యులేనన్నారు. సన్నబియ్యం, మధ్యాహ్న భోజనం, కిరోసిన్ పంపిణీ వంటి ప్రాధాన్యత అంశాలన్నీ నిజమైన లబ్ధిదారులకు చేరాలన్నారు.
నీలి కిరోసిన్ ఉంటే క్రిమినల్ కేసులే..
కిరోసిన్ పంపిణీలో తేడాలుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని కలెక్టర్ సూచించారు. నీలి రంగు కిరోసిన్ రేషన్‌కార్డు దారుల వద్ద లేదా డీలర్ల వద్ద లేదా గోదాముల వద్ద మాత్రమే ఉండాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థతోపాటు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేవలం ఉల్లిగడ్డ ఒక్కటే కాకుండా పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరగడానికి కారకులయ్యే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ... కస్టం మిల్లింగ్ లక్ష్యం రోజుకు 2,500 మెట్రిక్ టన్నులు తక్కువ కాకుండా లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డీఎం వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలకు చెక్ పెట్టాలి
Published Thu, Sep 10 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM
Advertisement