తిరుపూర్‌ స్థాయిలో సిరిసిల్ల | Sircilla as Tirupur level | Sakshi
Sakshi News home page

తిరుపూర్‌ స్థాయిలో సిరిసిల్ల

Published Thu, Aug 22 2019 3:15 AM | Last Updated on Thu, Aug 22 2019 3:15 AM

Sircilla as Tirupur level - Sakshi

సిరిసిల్లలో ఉత్పత్తి అయిన బతుకమ్మ చీరలను పరిశీలిస్తున్న కేటీఆర్, శైలజా రామయ్యర్‌.

సిరిసిల్ల: రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల లెక్క తేల్చామని, అన్నింటికీ జియోట్యాగింగ్‌ చేశామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో బుధవారం ఆయన చేనేత, జౌళిశాఖ అధికారులతో సమీక్షించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయరంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమను ఆధునీకరించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో వస్త్రఉత్పత్తి రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. రూ.70 కోట్లు ఉన్న రాష్ట్ర చేనేత, జౌళి శాఖ బడ్జెట్‌ ఇప్పుడు ఏటా రూ.1200 కోట్లతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక నేతన్నలకు ఉపాధి కలి్పంచే లక్ష్యంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు అందిస్తోందని చెప్పారు. తమిళనాడులోని తిరుపూర్‌ స్థాయిలో సిరిసిల్ల చీరలు బ్రాండ్‌ ఇమేజ్‌ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. నాలుగేళ్లలో సిరిసిల్లకు రూ.1,600 కోట్ల వస్త్రఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. ఆర్‌వీఎం బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్లు, రంజాన్, క్రిస్మస్‌ వ్రస్తాలు, సంక్షేమశాఖల ఆర్డర్లు అందించామని కేటీఆర్‌ వివరించారు. సిరిసిల్ల కార్మికులు గతంలో నెలకు రూ.7వేలు సంపాదిస్తే ఇప్పుడు రూ.16 వేలు సంపాదిస్తున్నారని స్పష్టం చేశారు. రూ.22.52 కోట్లతో 11,262 మరమగ్గాలు ఆధునీకరించామని వివరించారు. 

50 శాతం రాయితీలు  
చేనేత కార్మికులకు నూలు, రంగు, రసాయనాలకు 50 శాతం రాయితీలు, పవర్‌లూం కార్మికులకు పది శాతం నూలు రాయితీని కల్పించినట్టు కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని 11వేల మంది నేత కార్మికులకు రూ.29 కోట్ల రుణాలు మాఫీ చేశామని స్పష్టం చేశారు. సిరిసిల్ల శివారులో 64 ఎకరాల్లో అపెరల్‌ పార్కు నిర్మిస్తున్నామని, పది వేల మంది మహిళలకు ఉపాధి కలి్పంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. సిరిసిల్లలోని 1104 మంది కార్మికులను యజమానులుగా మార్చేందుకు రూ.386 కోట్లతో 88 ఎకరాల్లో వర్క్‌òÙడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. చేనేత కళాకారులకు అండగా సర్కారు రాష్ట్రంలోని చేనేత కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కేటీఆర్‌ తెలిపారు.

సిరిసిల్లతోపాటు పోచంపల్లి, దుబ్బాక, నారాయణపేట, గద్వాల లాంటి ప్రాంతాల్లోని నేతకార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. కార్మికులకు బీమా సదుపాయాన్ని కలి్పస్తున్నామని, త్రిప్ట్‌ పథకంలో 8 శాతం కార్మికుడు చెల్లిస్తే 16 శాతం ప్రభుత్వం చెల్లిస్తూ కారి్మకులకు పొదుపును అలవాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్లలో తయారైన బతుకమ్మ చీరలను ఆయన పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. పవర్‌లూం కార్ఖానాలోకి వెళ్లి బతుకమ్మ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజరామయ్యార్, జాయింట్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, టెస్కో జీఎం యాదగిరి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జౌళి శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాస్, ఆర్‌డీడీ తస్నీమా, జౌళి శాఖ ఏడీ అశోక్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement