నిలువునా మోసపోయిన యువకులు
పెబ్బేరు: ‘మీకు ఉద్యోగం కావాలా?, టెన్త్ పాస్ లేక ఆపై చదువు, నెలకు రూ.18వేల జీతం, మంచి భోజనం, వసతి సదుపాయాలు కలదు. ఉద్యోగాలు కావాల్సిన వారు మా నెంబర్‌లో సంప్రదించండి’ అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, ఆ త రువాత నిరుద్యోగుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు లాగడం, ఆపై బోర్డు తిప్పేయడం.. ఇదీ గతకొంత కాలంగా పెబ్బేరుకేంద్రంగా సాగుతున్నదగా. ఇలాగే కొంతమంది మోసపోయి రోడ్డునపడ్డారు. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసిం ది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా..
ఏం జరిగిందంటే..!
వనపర్తి మండలానికి చెందిన ఇంటర్‌మీడియట్ చదువుతున్న హరికృష్ణ, లక్ష్మణ్, పెబ్బేరు మండలానికి చెందిన శివ దినపత్రికల్లో వచ్చిన ప్రకటనను చూసి వారి సెల్‌నెంబర్‌కు ఫోన్‌చేయగా.. ఓ మహిళ అందుబాటులోకి వచ్చి సదరు యువకుల పూర్తివివరాలు అడిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, షాద్‌నగర్, జడ్చర్ల తదితర పట్టణాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్న ట్లు వివరించింది. ఉద్యోగం కావాల్సిన వా రు తాము సూచించిన బ్యాంకు ఖాతాకు ఒక్కొక్కరు రూ.600 నుంచి రూ.1100 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూ చించారు. ఈ మేరకు కంపెనీ ఈమెయిల్ పేరుతో ఓ చిరునామాకు కూడా చెప్పింది. దీంతో ఆ యువకులు జె.ప్రదీప్‌కుమార్ పేరుతో ఉన్న ఎస్‌బీఐ ఖాతానెం: 20132143858లో రూ.800, రూ.2400చొప్పున డిపాజిట్ చేశారు.
పెబ్బేరుకు చెందిన భానుప్రకాష్‌రెడ్డి, అశోక్‌కుమార్ పి.వాసు పేర ఉన్న ఎస్‌బీఐ ఖాతా 20131567696కు రూ. 600, రూ.1200 చొప్పున వేశారు. ఆ తరువాత ఫోన్‌లో ఆ మహిళను సంప్రదించ గా.. ఐదురోజుల్లో ఇంటికే అపాయింట్‌మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పింది. వారం రోజుల తరువాత మరోసారి ఫోన్‌చేయడంలో స్విచ్చాఫ్ అని రావడంతో బాధితులు కంగుతిన్నారు. మోసం చేస్తున్న వారిపై చర్యలు కోరారు.
ఉద్యోగాల పేరుతో దగా
Published Tue, Sep 9 2014 2:26 AM | Last Updated on Wed, Aug 29 2018 1:16 PM
Advertisement