ప్రస్తుతం ఎక్కడ చూసినా సమగ్ర కుటుంబ సర్వే గురించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరు కలిసినా సర్వేకు సంబంధించిన చర్చే పెడుతున్నారు. ఇదివరకు ఉద్యోగులు, సిబ్బంది ఎన్నో రకాల సర్వేలు చేసినప్పటికీ, ఒకేరోజులో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి రావడం ఇదే మొదటిసారి. దీంతో సర్వేచేస్తు న్న ఉద్యోగుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. పైగా ప్ర జల నుంచి సేకరించాల్సిన వివరాలు అధిక సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు ‘సమయం’ కీలకంగా మారనుంది.
ఒక్కొక్కరికి 30 కుటుంబాలు...
సర్వే చేసే సిబ్బందికి ఒక్కొక్కరికి 25 నుంచి 30 కు టుంబాలను కేటాయించారు. ఫార్మాట్‌లో ఉన్న ప్రకా రం నమూనా దరఖాస్తులతో ఎవరికి వారు ఎంత స మయంలో వివరాలు నమోదు చేయగలుగుతామో సి బ్బంది సొంతంగా రాసి పరీక్షించుకుంటున్నారు. ఒక రు అరగంటలో, మరొకరు 45 నిమిషాల్లో వివరాలు నమోదు పూర్తిచేశామని చెప్పుకుంటున్నారు.
అయితే కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య, అడిగిన వాటికి వారు స్పందించే తీరు, అవసరమైన ప్రతులను వారు చూపించే విధానంపై ‘సమయం’ ఆధారపడి ఉంటుం ది. విద్యావంతులు, సర్వే విధులు నిర్వహించే వ్యక్తు లు ముందుగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసి, ఎంత సమయం పడుతుందో ప్రయోగాత్మకంగా పరీక్షించుకుంటున్నారు. ఇంటర్నెట్ నుంచి సేకరించి న సర్వే నమూనా దరఖాస్తులను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. సర్వే కోసం వచ్చే సిబ్బంది తమ దగ్గరున్న దరఖాస్తుల్లోనే (ప్రభుత్వం జారీచేసిన దరఖాస్తుకు క్రమసంఖ్య ఉంటుంది) వివరాలు నమోదు చేసుకుంటారు.
అయినప్పటికీ నమూనా దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి, రుజువులకు అవసరమైన అన్ని పత్రాలను ఒక్కచోట సిద్ధంగా ఉంచుకుం టున్నారు. దీనివల్ల సర్వే కోసం వచ్చిన వారికి సౌకర్యంగా ఉంటుందని, వివరాల నమోదులో జాప్యం జరగదని ప్రజలు భావిస్తున్నారు.
12 గంటలకు పైనే..
ఒక్క ఎన్యూమరేటర్ 25 కుటుంబాలను సర్వే చేయా ల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబానికి తక్కువలో తక్కువగా అరగంట సమయం తీసుకునే అవకాశం ఉంది. అంటే 25 మందికి 12.30 గంటల సమయం పడుతుంది. ఒకవేళ కొంతవేగంగా పనిచేసేవారు, 25 నిమిషాల్లోనే ఒక కుటుంబం వివరాలు నమోదు చేసినా, 10.30 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్న భోజనం, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి పట్టే సమయం, ఇలా అన్నీ లెక్కలేసుకుంటే ఎటుతిరిగి ఎంతవేగంగా పనిచేసినా 12 గంటలకు పైగానే అవుతుం దని సిబ్బంది చెబుతున్నారు.
మంగళవారం నిర్వహిం చనున్న సర్వేలో తొలిసారి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు. తరుచూ వివిధ రకాలు సర్వే విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల కన్నా , ఇతర విభాగాల వారికి సర్వే వివరాల నమోదు ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రా మాలలో గ్రామసభలు నిర్వహించారు.
దీంతోపాటు కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారులు సైతం మీ డియా ద్వారా ప్రజలకు పలుమార్లు సర్వేపై అవగాహ న కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాకేంద్రం లో టోల్ ఫ్రీ నెంబరును సైతం ఏర్పాటు చేశారు. అవసరమైన పత్రాలన్నీ ఒకచోట పెట్టి సర్వే ప్రతినిధులకు సహకరిస్తే, ఒక్కరోజులో సర్వే విజయవంతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అన్నీ సిద్ధంగా ఉంటే అరగంటలోపే..
Published Tue, Aug 19 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement