సాక్షి, హైదరాబాద్: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతీ పనిని సానుకూల ధోరణితో స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో (టీఎస్‌పీఏ) బుధవారం జరిగిన ట్రైనీ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్‌ఐల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టాలకు లోబడి ధనిక, పేద తేడా లేకుండా సేవలను అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. మన అధికారాలు సామాన్య ప్రజల సేవలకు ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్, అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment