తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సభలో ఈ రోజు వైద్య, ఆరోగ్య, విద్య, హోం, పరిశ్రమలు, అటవీ శాఖతో పాటు వివిధ శాఖల పద్దులపై చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లు రేపు చర్చకు రానుంది. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బిల్లు, రాజీవ్ గాంధీ ఐఐటీ బిల్లులపై రేపు అసెంబ్లీలో చర్చజరుగనుంది.