ఘనంగా టాకో వార్షికోత్సవం | Telugu Association of Central Ohio Anniversary in US | Sakshi
Sakshi News home page

ఘనంగా టాకో వార్షికోత్సవం

Published Fri, Nov 21 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

Telugu Association of Central Ohio Anniversary in US

సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కొలంబస్‌లో సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం (టాకో) 30వ వార్షికోత్సవ కార్యక్రమాలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పంపిన సందేశాలను చదివి వినిపించినట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, ప్రధాన కార్యదర్శి సతీష్ వేమన, నాట్స్ బోర్డు చైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, నాట్స్ అధ్యక్షుడు రవి ఆచంట కూడా టాకో కార్యక్రమాలను ప్రశంసించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సందేశం పంపారని, టాకో అధ్యక్షుడు కె.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement