పాలిటెక్నిక్ కోర్సుకు పెరుగుతున్న ఆదరణ
పాలీసెట్ - 2016 దరఖాస్తుల విక్రయూలు ప్రారంభం
పోచమ్మ మైదాన్: అతి తక్కువ కాల వ్యవధిలో ఉపాధికి బాటలువేసే సాంకేతిక విద్యా కోర్సు పాలిటెక్నిక్. దీనిలో చేరేవారి సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. ఈ కోర్సు పూర్తి చేసినవారు అనంతర కాలంలో ఈసెట్ పరీక్ష రాసి నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశం పొందొచ్చు. ఉపాధికి ఊతమివ్వడమే కాక.. భవిష్యత్తులో ఇంజినీరింగ్ చేయూలనే ఆశయంతో ఉన్న విద్యార్థుల పాలిట పాలిటెక్నిక్ వరంగా మారింది. ప్రవేశ విద్యార్హత పదోతరగతి. 2016-17 విద్యా సంవత్సరానికి పాలీసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల విక్రయూలు ఇప్పటికే ప్రారంభమయ్యూరుు. దరఖాస్తుల స్వీకరణ కోసం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు.
చివరి తేదీ ఏప్రిల్ 10
అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 10 చివరి తేదీ. ఈసారి టీఎస్ ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అభ్యర్థులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలు సమయం ఇస్తారు. గణితం 60 మార్కులు, భౌతికశాస్త్రం 30 మార్కులు, రసాయనశాస్త్రం 30 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మే 3న పాలీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
4 హెల్ప్‌లైన్ కేంద్రాలు
అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు వరంగల్‌లో 4 హెల్ప్‌లైన్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. అవి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్, స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్, మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్‌లలో అభ్యర్థులు ఎక్కడి నుంచైనా రూ.300 దరఖాస్తు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు నింపి కౌంటర్‌లో ఇస్తే వెంటనే అధికారులు హాల్ టికెట్‌ను జారీ చేస్తారు. జిల్లాలో 23 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 5 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా, మిగిలినవన్నీ ప్రైవేటు యూజమాన్యాలకు చెందినవి. వీటిలో సుమారు 5040 దాకా సీట్లు ఉన్నాయి. ఈఈఈ,మెకానికల్, సివిల్, ఈసీఈ, సీఎంఈ, సీసీపీ స్పెషలైజేషన్లతో కోర్సులు అందిస్తున్నారు.
చక్కటి కెరీర్‌కు వారధి
పాలిటెక్నిక్ కోర్సు ఉపాధి అవకాశాలకు వారధి. త్వరగా ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఏటా దీనికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు చేసిన విద్యార్థులు అనంతర కాలంలో బీటెక్ కూడా చేయొచ్చు. చాలా కంపెనీలో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తున్నారుు.
- శంకర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్