నల్లగొండ జిల్లాలో ఓ ఇంటిలో దొంగలు చోరికి పాల్పడ్డారు.
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో ఓ ఇంటిలో దొంగలు చోరికి పాల్పడ్డారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీకు చెందిన గుర్రం కార్తీక్ సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి గురువారం సాయంత్రం ఊరెళ్లారు.
ఆదివారం తిరిగి రాగా ఇంటిలోని వస్తువులు చిందరబందరంగా పడి ఉన్నాయి. చోరీ విషయాన్ని గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.59వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.