సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గురువారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించింది. ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కొందరు ఆందోళనకారులను అడ్డుకున్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ మరిచి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment