
రుణవూఫీపై నేడు స్పష్టత: పోచారం
డిచ్‌పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు జరిగే కేబి నెట్ సమావేశంలో రైతు రుణాలతోపాటు, బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాల మాఫీ విషయంలో స్పష్టత రానుం దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.