ఎన్‌హెచ్-44పై సదుపాయాలు కల్పించండి
* లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా గుండా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై 78 చోట్ల గ్రామాలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు ఉన్నాయని, ఆయా గ్రామాలకు వెళ్లే వారు హైవేను దాటాల్సి ఉంటుందని, ఆ సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 500 మంది ఈ రోడ్డులో ప్రమాదవశాత్తు చనిపోయారన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన 78 చోట్ల్ల జీబ్రాలైన్లు, స్పీడ్‌బ్రేకర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.