
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నేతలు
సిరికొండ(నిజామాబాద్ రూరల్) : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని, కేవలం మాటల ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జి కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఒక రోజు నిరాహార దీక్షను మంగళవారం నిర్వహించారు. దీక్షలో కూర్చున్న ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిట్టల దొరలాగా ఉత్తుత్తి మాటలు చెబుతూ నాలుగేళ్లుగా పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఇప్పుడెమో పెద్దల జపం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తన కుటుంబసభ్యులకు ఒక్కో పదవి కట్టబెట్టి తెలంగాణను తన జాగీరులాగా చేసుకొని కుటుంబ పాలన చేస్తున్నాడని ఆరోపించారు. అనంతరం ఉప తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు బస్వా లక్ష్మీనర్సయ్య, మండలాధ్యక్షుడు లింబాగౌడ్, రామస్వామి, రాజేశ్వర్, బొర్రన్న, రాజన్న, రమేశ్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment