దాడికి పాల్పడిన యువకులు, గాయపడిన టోల్‌ప్లాజా సూపర్‌వైజర్ మహేశ్‌గౌడ్
వేడుకలకు సాయి తేజ్‌రెడ్డితో పాటు, ఎల్‌బీనగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్ కొడుకు మనీష్‌గౌడ్, ఐదుగురు మిత్రులతో కలసి జిప్సీ వాహనంలో మైసిగండి వచ్చారు. బర్త్‌డే వేడుకల అనంతరం రాత్రి తిరుగు పయనమ య్యారు. మార్గమధ్యలో కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద నిర్ణీత మార్గంలో కాకుండా పక్కన ఉన్న బారికేడ్‌లను తొలగించి ముందుకు సాగారు. దీంతో టోల్‌ప్లాజాలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కడ్తాల్‌కి చెందిన మాదారం మహేశ్ గౌడ్ సరైన దారిలో రావాలని కోరాడు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేశ్‌గౌడ్‌పై దాడి చేశారు. వాహనంలో ఉన్న అరుణ్‌రెడ్డి కిందకు దిగి అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో మహేశ్‌గౌడ్‌పై దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో అతనికి రెండు చేతులకు గాయాలయ్యాయి.
గమనించిన టోల్‌గేట్ సిబ్బంది ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు వాహనంలో పారిపోయారు. వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది కడ్తాల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌కు సమాచారం అందిచారు. దీంతో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టి పారిపోతున్న యువకులను పట్టుకున్నారు. బాధితుడు మహేశ్‌గౌడ్ ఫిర్యాదు మేరకు వారిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.