సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణ ప్రజలకు సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చిననాడే లాభం ఉంటుందని టీఆర్‌ఎస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని నీటి లభ్యత, నాణ్యత అంశాలపై స్వానిటి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీలు సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్, బండ ప్రకాశ్, బడుగు లింగయ్య, ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్ర తేజావత్, తెలంగాణ భవన్ ఆర్సీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ నిపుణులు ఎం.కె.శ్రీనివాస్, జలవనరుల అభివృద్ధి అథారిటీ ఎంఎస్ అగర్వాల్, జలవనరుల అథారిటీకి సంబంధించిన టెక్నోక్రాట్ల బృందం తెలంగాణలోని నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment