
కంటోన్మెంటూ మాదే జీహెచ్ఎంసీ మాదే
కంటోన్మెంట్ ఎన్నికల్లోనే కాదు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని మంత్రి హరీష్రావు తెలిపారు.
కంటోన్మెంట్ ఎన్నికల్లోనే కాదు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని మంత్రి హరీష్రావు దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందన్నారు.
కాకతీయ ఉత్సవాలు కూడా చేయించలేక.. వాటికోసం మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి కాళ్లు పట్టుకున్న చరిత్ర టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా చెల్లని రూపాయికి గీతలెక్కువ పొన్నాలకి మాటలెక్కువ అని విమర్శించారు.