
ఐలాండ్ అభివృద్ధి నమూనా
కరీంనగర్‌సిటీ: కరీంనగర్ ఆధునిక హంగులతో ఏర్పాటు చేయనున్న కేసీఆర్ ఐలాండ్ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం తెలిపారు. మానేరు డ్యాంను శని వారం సాయంత్రం మంత్రి గంగులతోపాటు టూరిజం ఈడీ శంకర్‌రెడ్డి సందర్శించారు. స్థాని క అధికారులు కేసీఆర్ ఐలాండ్ మ్యాప్‌తోపాటు నిర్మాణాలను వారికి వివరించారు. నిర్మాణం కాకున్న గుట్టను మంత్రితో కలిసి పరిశీలించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో నిర్మించనున్న కేసీఆర్ ఐలాండ్ వివరాల ను మంత్రి ఈడీకి వివరించారు. కరీంనగర్‌లోని మానేరు డ్యాంకు అనుకుని ఆధునిక హంగులతో అత్యంత విశాలంగా ఎంట్రెన్స్ లాబీ, పూర్తిగా అద్దాలతో బాంకెట్‌హల్, మెడిటేషన్ హబ్‌తోపాటు ఇండోనేషియా అర్కిటేక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు, 40 మంది విందు చేసుకునేందుకు వీలుగా ప్లోటింగ్‌రెస్టారెంట్, 7స్టార్‌కు మించిన సదుపాయాలతో ప్రెసిడెన్సియల్ సూట్, స్మిమ్మింగ్ పూల్‌ను ఏ ర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ రేనొవేషన్ సిటీలో భాగంగా నిర్మించనున్న కేసీఆర్ ఐలాండ్‌ను ఏడాదిలోగా పూర్తి చేయడానికి కాంట్రాక్టు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేయాలని పేర్కొన్నారు. మంచినీళ్ల మధ్య ఈ ఐలాండ్ ఉండడం అదనపు ఆకర్షణ అని, ఎల్‌ఎండీలో ఉన్న గుట్ట రాష్ట్రంలోని మరే ఏ ఇతర ప్రాజెక్టులో కనిపించదని పేర్కొన్నారు. ఈ గుట్టలో నాలుగు ఎకరాలు గుట్ట ఉండడం మూలంగా కరీంనగర్‌కు ఒక ఐకాన్‌గా నిలుస్తుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి కరీంనగర్ కార్పొరేషన్‌కు సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.100 కోట్ల నుంచి రూ.3 కోట్లు కేటాయించామని, మరో రూ.2 కోట్లను పర్యాటక శాఖ కేటాయించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment