నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ వీఆర్వో ఓ రైతు ఆస్తి మార్పిడికి 18 వేలు లంచం డిమాండ్ తీసుకున్నాడు.
దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం వీఆర్వో తన కార్యాలయంలో రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోపై ఏసీబీ అధికారులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.