
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: కేసీఆర్
హైదరాబాద్: ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పేద ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న కోర్టు ఉత్తర్వుల విషయం పై వ్యూహంతో ముందుకు వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలౌతున్నాయని గుర్తు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అవకాశాలను వినియోగించుకుని రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.