తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో పీయూష్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడులతో చెప్పినట్టు సమాచారం. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో నెలకొల్పాల్సిన 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరేందుకు వీరు కేంద్రమంత్రిని గురువారం కలిశారు. అలాగే వివిధ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు బొగ్గు లింకేజీ ఏర్పాటుచేయాలని, అదనపు విద్యుత్ కేటాయింపులు జరపాలని కోరారు.
ఇద్దరు సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తాం: పీయూష్ గోయల్
Published Fri, Aug 8 2014 4:44 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement