
గుత్తికోయలను తెలంగాణలోకి రానివ్వం
గుత్తికోయలను తెలంగాణ అడవుల్లో ప్రవేశించకుండా అడ్డుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. వాళ్ల వల్ల అడవులకు నష్టం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడవుల రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయని, తమ ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
దీనికోసం అవసరమైతే కొత్త చట్టాలు రూపొందిస్తామన్నారు. అడవుల నరికివేతపై నమోదయ్యే కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ లోగోను ఆవిష్కరించారు.