సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తార్నాకలోని ఐఐసీటీలో శనివారం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక ఫలాలు సామాన్య ప్రజలకు అందాలన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు వ్యవసాయ రంగానికి ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇస్రో 100 ఉపగ్రహాలకు పైగా ఒకేసారి నింగిలోకి పంపటం ఎంతో గర్వకారణమన్నారు. దేశాభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో దోహదం చేస్తాయని వెల్లడించారు.
Minister @KTRTRS presented the Young Scientist Awards to Research Associates, Scientists and Assistant Professors at Indian Institution of Chemical Technology (IICT) campus in Hyderabad. pic.twitter.com/6GaqxegYDu
— Min IT, Telangana (@MinIT_Telangana) April 28, 2018
Comments
Please login to add a commentAdd a comment