అవినీతికి పాల్పడుతున్నరేషన్ డీలర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు.
నర్వ (మహబూబ్‌నగర్): అవినీతికి పాల్పడుతున్నరేషన్ డీలర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఎమ్మెల్యే నుంచి హామీ పొంది తాను అనుకున్నది సాధించాడు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వెంకటేష్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేష్ బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న సెల్‌టవర్ ఎక్కాడు. అవినీతి రేషన్ డీలర్‌ను తొలగిస్తేగానీ కిందకు రానని మొండికేశాడు. అదే సమయంలో ఎంపీడీవో కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఈ విషయం తెలుసుకుని రేషన్ డీలర్‌ను తప్పిస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు సెల్‌టవర్ దిగి వచ్చాడు. దీంతో కథ సుఖాంతమైంది.