నేడు పరామర్శించనున్న కుటుంబాలు | YS Sharmila's Paramarsa Yatra on 5th day in Mahabubnagar | Sakshi
Sakshi News home page

నేడు పరామర్శించనున్న కుటుంబాలు

Published Fri, Dec 12 2014 5:57 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

నేడు పరామర్శించనున్న కుటుంబాలు - Sakshi

నేడు పరామర్శించనున్న కుటుంబాలు

కొందుర్గు: షర్మిల శుక్రవారం మండలంలోని పెద్దఎల్కిచర్ల గ్రామానికి చేరుకుని వైఎస్‌ఆర్ మృతిని తట్టుకోలేక మృతిచెందిన సుంకరి కిష్టమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తన తల్లి కిష్టమ్మకు రాజశేఖరరెడ్డి అంటే అపారమైన గౌరవమని, తనకు ప్రతినెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడని తెలిపేదని కిష్టమ్మ కొడుకు బాలయ్య తెలిపారు. వైఎస్ మృతివార్త విని గుండెపోటుతో చనిపోయిందని వాపోయాడు. ఆ మహానేత కూతురు తమ ఇంటికి రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.
   
కొత్తూరు: దివంగత  సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక మండలంలో ఇద్దరు మృతిచెందారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం మధ్యాహ్నం మండలానికి రానున్నారు. మొదట నర్సప్పగూడలో మృతి చెందిన పెంటమీది అండాలు కుటుంబసభ్యులను పరామర్శించి అక్కడి నుండి చేగూరు మీదుగా స్టేషన్ తిమ్మాపూర్- మల్లాపూ ర్ గ్రామానికి వెళ్లి పిన్నింటి నాగిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారని పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తెలిపా రు. పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.
   
బాలానగర్: దివంగత సీఎం వైఎస్‌ఆర్ మృతిని తట్టుకోలేక మృతిచెందిన బాలానగర్ మండలం గుండ్లపొట్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల శంకరయ్య కుటుంబాన్ని శుక్రవారం షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్‌ఆర్ మృతిని జీర్ణించుకోలేక గుండెఆగిన ప్రతిఒక్కరి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానని అప్పట్లో వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో ఇచ్చిన మాటకోసం ఆమె నేడు గుండ్లపొట్లపల్లికి రానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement