
బీమా పాలసీల్లో నామినీ మార్పుకు 100 వరకూ చార్జీ
న్యూఢిల్లీ: బీమా పాలసీల్లో నామినేషన్ రద్దు, మార్పులు, చేర్పులు చేయడం ఇప్పుడు ఖరీదు కానున్నది. ఇలాంటి మార్పులకు బీమా కంపెనీలు రూ. వంద వరకూ వసూలు చేసుకోవచ్చని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏ(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ) పేర్కొంది. ఆన్‌లైన్ పాలసీలకైతే ఇది రూ.50 అని వివరించింది.
ఇంతకు మించి బీమా సంస్థలు వసూలు చేయడానికి వీలు లేదని ఐఆర్‌డీఏ తెలిపింది. నామినేషన్ రద్దు, నామినేషన్ మార్పులకు సంబంధించి ఐఆర్‌డీఏ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బీమా చట్టం ప్రకారం, బీమా పాలసీదారుడు, తాను మరణించిన పక్షంలో వచ్చే ప్రయోజనాల ను పొందే వారి పేరును నామినీగా పేర్కొనాలి.