
117 మంది తీవ్రవాదుల హతం
డెమాస్కస్: దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలల్లో తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని సైనిక బృందాలు ముమ్మరం చేశాయి. అందులోభాగంగా దాదాపు 117 మంది తీవ్రవాదలను మట్టుబెట్టినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఆల్ ఖైదాలో సంబంధాలు ఉన్న 47 మంది తీవ్రవాదులను మషారా పట్టణంలో చంపివేసినట్లు తెలిపింది.
అలాగే దక్షిణ ప్రావెన్స్లోని దర్రార్లో 70 మంది రెబల్స్ను అంతమొందించినట్లు పేర్కొంది. అయితే సిరియా రాజధాని డెమాస్కస్లో శనివారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారని మీడియా వెల్లడించింది.